GDWL: ఎలక్ట్రిషన్స్, ప్లంబర్స్ పని ప్రదేశంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందని TPCC ప్రతినిధి శక్షావలి ఆచారి సూచించారు. బుధవారం అయిజలోని ఓ హాల్లో నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొని నిబద్ధతతో పనిచేసి వినియోగదారులకు మంచి సేవలు అందించాలని చెప్పారు. అనంతరం యూనియన్ సభ్యులకు ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు.