ఖమ్మం నగరంలోని చర్చి కంపౌండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై విరిగిన జాయింట్ రబ్బర్ స్టిక్స్కు మరమత్తులు చేయాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం ఆర్ అండ్ బీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనదారులు ఈ బ్రిడ్జిపై ప్రయాణం చేయాలంటే భయాందోళన చెందుతున్నారని, తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు.