TG: కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. జనవరి 3న అసెంబ్లీని ముట్టడిస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా హామీలను అమలు చేయకపోవడం, మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటోల ఆదాయం తీవ్రంగా తగ్గిందని ఆరోపించింది.