WNP: జిల్లాలో ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన శిక్ష తప్పదని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ హెచ్చరించారు. బుధవారం వీపనగండ్ల మండలంలోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు సజావుగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తేమశాతం పరీక్షించిన వెంటనే తూకం వేయాలని సూచించారు.