GNTR: పొన్నూరులో అమీన్ పీర్ పెద్ద దర్గా పీఠాధిపతి ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుస్సైనీ పదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శిష్య బృందం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలు, పండ్లు పంపిణీ చేశారు. మతసామరస్యానికి దర్గా ప్రతీకగా నిలుస్తోందని మీడియా ప్రెసిడెంట్ తోట రాంబాబు అన్నారు.