కృష్ణా: పేదల ఆరోగ్యంపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పదమూడు మంది లబ్ధిదారులకు రూ.25,00,426 ఆర్థిక సహాయం చెక్కులు అందచేశారు. కూటమి ప్రభుత్వంలో 918 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.7,59,14,691 అందచేశారు.