RR: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని అఖిలపక్ష నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీని సర్కిల్ గా ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ మొత్తాన్ని ఎల్బీనగర్ జోన్లో కలిపి నాలుగు డివిజన్లుగా ఏర్పాటు చేయాలని కోరారు.