SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని లల్లి ప్రియ నాయక్ బుధవారం అదృశ్యమైంది. తల్లి ఫిర్యాదు మేరకు సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి, రెండు గంటల్లోనే చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా తల్లి ఆనందంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.