GDWL: నూతన సంత్సరం వేడుకల పేరుతో మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని గద్వాల ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ వేడుకలపై పూర్తి నిషేధం ఉందని, ప్రధాన కూడళ్లలో కేకులు కట్ చేయడం లేదా డీజేలతో శబ్ద కాలుష్యం సృష్టించడం చట్టరీత్యా నేరమన్నారు.