MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ అభివృద్ధికి సహకరించాలని మల్కాపూర్ పంచాయతీ పాలక వర్గ సభ్యులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ నేతృత్వంలో వారు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో యాదయ్య, జడ్పీ సీఈవో ఎల్లయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.