KRNL: ఆలూరులో మీడియా సమావేశంలో TDP నియోజకవర్గ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతూ.. “సూపర్ సిక్స్-సూపర్ హిట్”గా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు.