SRD: సంగారెడ్డి జిల్లాలో జనవరి 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. హెవీ వెహికిల్స్, ఆటో డ్రైవర్లకు ఆరోగ్య, కంటి పరీక్షల నిర్వహణకు క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పాఠశాలల మేనేజ్మెంట్కు పాఠశాలల బస్సుల సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.