E.G: ఉండ్రాజవరం (M) వడ్లూరులో బుధవారం నిర్వహించిన NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురికి స్వయంగా పింఛన్ నగదు పంపిణీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో పేదల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోందని మంత్రి పేర్కొన్నారు.