TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బీజాపూర్ జాతీయరహదారిపై బైకును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చేవెళ్ల మండలం మల్కాపూర్ వాసి రఘునాథరెడ్డి (25) మృతి చెందాడు. మొయినాబాద్ పోలీసుశాఖ పెట్రోల్ పంపులో రఘునాథరెడ్డి పనిచేసేవాడు.