KNR: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రమం తప్పకుండా సదరం శిబిరాలు నిర్వహించాలని, అర్హులకు సదరం సర్టిఫికెట్లు అందించాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. సదరం శిబిరాల నిర్వహణ, యూడీఐడీ తదితర అంశాలపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలు, అధికారులతో సెర్ప్ సీఈవో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.