HNK: పట్టణ కేంద్రంలోని కేయూ పోలీస్ స్టేషన్లో బుధవారం సీఐ రవికుమార్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలు, భూకబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని సీఐ హెచ్చరించారు. నేరాల నియంత్రణకు ఈ కౌన్సెలింగ్ భాగమని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.