ATP: షెడ్యూల్ కులాలు, తెగల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను నిర్ణీత శాతం ప్రకారం ఖర్చు చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురంలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ పథకంలో ఎస్సీలకు 17.08 శాతం, ఎస్టీలకు 5.53 శాతం నిధులు వ్యయం చేసేలా చూడాలని పేర్కొన్నారు.