TG: సంక్రాంతికి HYD నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు టోల్ ఫీ మినహాయింపు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇది మంత్రి సొంత నిర్ణయమా..? లేదా ప్రభుత్వ నిర్ణయమా? అని అంటున్నారు. మేడారం జాతర, దసరాకు లేని శ్రద్ధ.. సంక్రాంతిపై ఎందుకని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ నిర్ణయం కరెక్టేనా..?