»Lok Sabha Polls 2024 Phase One Zero Per Cent Voting Recorded In 6 Nagaland Districts
Elections 2024 : ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్.. చరిత్రలో మొదటిసారి!
దేశ వ్యాప్తంగా శుక్రవారం జరిగిన మొదటి విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓ రాష్ట్రంలో ఉన్న ఆరు జిల్లాల్లో మాత్రం జీరో పోలింగ్ నమోదై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి ఘటన నమోదు కావడం నాగాలాండ్ చరిత్రలో ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Lok Sabha Elections 2024 : దేశ వ్యాప్తంగా మొదటి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాగంగా నాగాలాండ్‌లోని ఆరు తూర్పు జిల్లాల్లో మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటేయడానికి రాలేదు. దీంతో అక్కడ పోలింగ్ శాతం సున్నాగా(zero per cent voting) నమోదైంది. రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ బూత్ సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు తొమ్మిది గంటల పాటు బూత్‌ల వద్ద వేచి చూశారు. అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా అక్కడ ఓటు వేయలేదు.
నాగాలాండ్‌లో(Nagaland) తూర్పు ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి డిమాండ్‌తో… ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ(ఎఫ్ఎన్టీ) బంద్‌కి పిలుపునిచ్చింది. దీంతో ఈ ఆరు జిల్లాల్లోని ప్రజలు పోలింగ్ని బహిష్కరించారు. ఈ జిల్లాల్లో దాదాపుగా నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారెవరూ కూడా ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. ఈ విషయమై నాగాలాండ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లోరింగ్ మాట్లాడారు. ఆరు జిల్లాల్లోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ప్రాంతంలో మొత్తం 738 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తూర్పు నాగాలాండ్ లోని ఆరు జిల్లాల్లో( 6 Nagaland districts) పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సిబ్బంది బూత్‌ల్లో వేచి చూశారని ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. అయినప్పటికీ ఒక్కరు కూడా ఓటు వేయడానికి రాలేదని తెలిపారు. అక్కడ పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎఫ్ఎన్టీ నిరవధిక బంధ్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఈ పరిస్థితి నెలకొంది.
First time in history after statehood of Nagaland, no voters showed up in six districts of the Eastern part of Nagaland expressing their discontent and frustration over the Modi government's failure to deliver on its promises.#LokSabhaElection2024#Nagalandpic.twitter.com/jvptyyzExN