TG: HYDలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని GHMC కమిషనర్ కర్ణన్ తెలిపారు. సెవెన్ స్టార్ గార్భేజ్ ఫ్రీ సిటీ ధ్రువపత్రం కూడా వచ్చిందన్నారు. ప్రత్యేకంగా నెల రోజుల పాటు పారిశుద్ద్యంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. GHMC పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లు పెంచాలని నిర్ణయించామన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే ప్రకారం దేశంలో హైదరాబాద్ ఆరోస్థానంలో ఉందన్నారు.