జిల్లాల పునర్విభజన అనంతరం కడప జిల్లా 12,507 చ.కిమీ విస్తీర్ణంతో ఏపీలోనే అతిపెద్ద జిల్లాగా మారిందని అధికారులు తెలిపారు. జనాభాలో రెండవ స్థానంలో ఉన్న ఈ జిల్లాలో 8 నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 9 మున్సిపాలిటీలు, 40 మండలాలు ఉన్నాయి. రాజంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలు కలవడంతో జనాభా 22,96,497కు పెరిగింది.