GDWL: దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ఇంకా బ్రిటిష్ విధానాలే పాటించడం సరికాదు, నిరంతరం ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది అని సౌత్ ఇండియా కన్వీనర్ అనన్యా రాజ్ పేర్కొన్నారు. బుధవారం గద్వాల పట్టణంలో జిల్లా కన్వీనర్ సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో ఓ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ ఎన్నికల వల్ల కోట్ల ప్రజాధనం వృధా అవుతుందన్నారు.