KRNL: కొత్త ఏడాదికి స్వాగతం కోసం బుధవారం కర్నూలు మార్కెట్లోకి ఆకర్షణీయమైన కేకులు అందుబాటులోకి వచ్చాయి. బేకరీ యజమానులు రకరకాల ఆకృతులతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ప్లమ్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్ ట్రఫుల్ కేకులకు గిరాకీ ఎక్కువగా ఉంది. కేకులపై 10-30% వరకు రాయితీ, సాఫ్ట్ డ్రింక్ ఫ్రీగా ఇస్తున్నట్లు బేకరీ యజమానులు చెప్పారు.