GDWL: 38 ఏళ్ల పాటు విధుల్లో ఉంటూ క్రమశిక్షణ, అంకితభావంతో సమాజానికి సేవ చేయడం గర్వకారణం అని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు కొనియాడారు. బుధవారం పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ నిత్య పూజయ్యను ఎస్పీ శాలువా, పూలమాలతో సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పదవీ విరమణ తర్వాత ఆయన ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్లను అందిస్తామన్నారు.