GDWL: పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి, ఓటర్ల జాబితా నుంచి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వరకు అన్ని ప్రక్రియలను గడువులోగా పూర్తి చెయ్యాలి అని జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను బుధవారం ఆదేశించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు.