RR: షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ గ్రామంలో బస్టాండ్ కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ శ్వేత చంద్రబాబు, కేకే కృష్ణ హాజరయ్యారు. భూమి పూజ చేసిన అనంతరం మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా ముందుంటానని సర్పంచ్ తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశాల మేరకు తన వంతు సహాయం చేస్తానని కేకే కృష్ణ పేర్కొన్నారు.