PLD: నూతన సంవత్సరం సందర్భంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారు శాలువాలు, బొకేలు, పుష్పగుచ్ఛాలు, నోట్ పుస్తకాలు, పెన్నులు వంటి వస్తువులు తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.