NGKL: మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించాలని మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ కోరారు. బుధవారం అచ్చంపేట ఆర్టీసీ డిపోకు సంబంధించిన రూ.3,22,556 పన్ను బకాయిలను డిపో అధికారులు మున్సిపాలిటీకి అందజేశారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తేనే పట్టణంలో మౌలిక వసతుల కల్పన మెరుగుపడుతుందన్నారు.