»Lowest Margin Candidate In Lok Sabha Polls And Young Mp
Polls : ఈ ఎన్నికల్లో చిత్రమైన విజయాలు వీరివి!
మంగళవారం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అత్యంత చిత్రమైన విజయాల గురించి తెలుసుకుందాం. ఒకరు 25 ఏళ్లకే ఎంపీ అయ్యారు.. మరొకరు 48 ఓట్ల తేడాతో గెలిచారు.. వారు ఎవరంటే?
Lok Sabha Polls : అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలంటే ఇక్కడే కాదు.. ప్రపంచ వ్యాప్తంగానూ అంతే ఆసక్తి. అలాంటి దేశంలో ఎన్నికల సిత్రాలకు కొదువే లేదు. ఈ లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Polls ) ఒకరు కేవలం 48 ఓట్ల తేడాతో నెగ్గి ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నారు. మరొకరు అతి చిన్న వయసులోనే ఎంపీగా మారారు. వీరికి ఈ చిత్రమైన విజయాలు ఎలా దక్కాయో తెలుసుకుందాం. పదండి.
ఈ ఎన్నికల్లో బిహార్లో ఎన్డీయే మిత్రపక్షం అయిన ఎల్జేపీ(ఆర్) ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ తరఫున సమస్తీపూర్ నుంచి శాంభవీ చౌదరి పోటీ చేశారు. ఆమె వయసు 25 సంవత్సరాల పదకొండు నెలల 20 రోజులు. ఇంత చిన్న వయసులోనే ఆమె కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజారీపై 1,87,537 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో ఈ ఎన్నికల్లో అతి పిన్న ఎంపీగా ఆమె పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు.
ఇక మహారాష్ట్రలో శిందే వర్గానికి చెందిన రవీంద్ర వైకర్ అనే అభ్యర్థి(Candidate)… శివసేన(యూబీటీ) అభ్యర్తి అమోల్ కీర్తికర్పై విజయం సాధించారు. అతి స్వల్పమైన ఆధిక్యంతో రవీంద్ర వైకర్ విజయం సాధించడం గమనార్హం. ఈ ఫలితాల్లో అమోల్ కీర్తికర్కు 4,52,596 ఓట్లు వచ్చాయి. ఆయనపై విజయం సాధించిన రవీంద్రకు 4,52,644 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 48 ఓట్లు ఆయనను పార్లమెంటులో అడుగు పెట్టేలా చేశాయన్నమాట!