»Rahul Gandhis Resignation The Strength Of The Congress Has Decreased In The Lok Sabha
Rahul Gandhi: రాహుల్ గాంధీ రాజీనామా.. లోక్ సభలో తగ్గిన కాంగ్రెస్ బలం
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ఎంపీకి రాజీనామా చేశారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ్యత్వానికి ఇటీవలే రాజీనామా చేయగా పొట్రెం స్పీకర్ నేడు ఆమోదించారు. దీంతో మళ్లీ కాంగ్రెస్ బలం 99కి చేరుకుంది.
Rahul Gandhi's resignation.. The strength of the Congress has decreased in the Lok Sabha
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ఎంపీకి రాజీనామా చేశారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ సభ్యత్వానికి (Wayanad Lok Sabha seat) రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవలే రాజీనామా చేయగా పొట్రెం స్పీకర్ నేడు ఆమోదించారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమైన తరువాత లోక్‌సభ ప్రొటెం స్పీకర్ (Pro tem Speaker) భర్తృహరి మహతాబ్ ఈ రోజు ఉదయం రాహుల్ రాజీనామాను ఆమోదించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నిక్లో రాహుల్ గాంధీ యూపీలోని రాయ్‌బరేలీతో పాటు వయనాడ్‌లో కూడా పోటీ చేశారు. రెండు చోట్ల మంచి మెజారిటీతో గెలుపొందారు.
ఒక అభ్యర్థి ఇలా రెండు చోట్ల ఎన్నిక అయితే ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాలి. అది కూడా ఫలితాలు వచ్చిన 14 రోజుల్లోగా ఒక స్థానానికి రాజీనామా చేయాలి. ఈ నిబంధనలు అనుసరించి ఆయన పోటీ చేసిన వయనాడ్‌ను వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఆ గడువు లోపే తన రాజీనామాను లోక్ సభకు ఇచ్చారు. పొట్రెం స్పీకర్ తన రాజీనామాను అమోదించారు. దీంతో రాహుల్ గాంధీ రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగనున్నారు. రాహుల్ రాజీనామాతో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ బలం 99కి తగ్గింది. నిజానాకి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లే వచ్చాయి. కానీ మహారాష్ట్ర నుంచి ఎన్నికైన రెబల్ అభ్యర్థి కాంగ్రెస్‌కి మద్దతు ఇవ్వడంతో ఆ సంఖ్య 100కు చేరుకుంది. ఇప్పుడు రాహుల్ రాజీనామాతో మళ్లీ 99కి వచ్చింది.