»Neet Pg Postponement Of Neet Pg Exam Union Health Department Announcement
NEET PG: నీట్-పీజీ పరీక్ష వాయిదా.. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.
NEET PG: Postponement of NEET-PG exam.. Union Health Department announcement
NEET PG: నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ముందు జాగ్రత్తగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
పరీక్ష వాయిదా వల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం కేవలం వాళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్నామని తెలిపారు. పరీక్ష ఆదివారం కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లు పరీక్ష కేంద్రం సమీపానికి శనివారమే చేరుకున్నారు. పరీక్ష వాయిదా పడటంతో ఒక్కసారిగా వాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీట్ యూజీతో పాటు యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐ పూర్తిస్థాయి విచారణ జరపనుంది. అయితే నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయడాన్ని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోల్ల శ్రీనివాస్ ఖండించారు. శనివారం రాత్రి పరీక్షను వాయిదా వేయడం కేంద్రం చేతకానితనమన్నారు. పరీక్షల వాయిదాలతో కేంద్రం విద్యార్థులు జీవితాలతో ఆటలాడుతున్నదని ఆయన విమర్శించారు.