»Dk Shivakumar Backlash In Supreme Court For Deputy Chief Minister
DK Shivakumar: ఉప ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్ద తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో తనపై సీబీఐ కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
DK Shivakumar: Backlash in Supreme Court for Deputy Chief Minister
DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్ద తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో తనపై సీబీఐ కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చి ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. డీకే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. 2013-2018 మధ్య అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో శివకుమార్ మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో డీకే సంపాదనలో రూ.74 కోట్లు లెక్కకు మించిన ఆదాయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలోనే ఆయన నివాసం, ఆఫీసుల్లో ఐటీ శాఖ సోదాలు జరిపి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.
ఆ తర్వాత ఈ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టింది. ఈడీ విచారణ ఆధారంగా 2020లో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసును సవాల్ చేస్తూ శివకుమార్ 2021లో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం కొంతకాలం మధ్యంతర స్టే విధించింది. ఈ క్రమంలోనే సీబీఐ కేసును కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను గతేడాది అక్టోబరులో హైకోర్టు కొట్టేసింది. అంతేగాక, దీనిపై దర్యాప్తు చేసి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఈ తీర్పుపై డీకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ పిటిషన్‌ను కొట్టేసింది.