NEET PG 2024: NEET PG Exam New Schedule Released.. Exam in Two Shifts!
NEET PG 2024: నీట్ పీజీ 2024 పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల అయ్యింది. పేపర్ లీకేజీ కారణంగా ఈ పరీక్ష వాయిదా పడింది. దీంతో రీషెడ్యూల్ చేసి కొత్త తేదీలను విడుదల చేశారు. ఆగస్టు 11న పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఒకే రోజు రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుందని తెలిపింది. మొదట్లో జూన్ 23న నిర్వహించాలని భావించారు. కానీ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీ కావడంతో దేశవ్యాప్తంగా వివాదం నెలకొంది. దీంతో నీట్ పీజీ 2024 పరీక్షను కొన్న గంటల ముందు కేంద్రం వాయిదా వేసింది.
పేపల్ లీక్‌పై వివాదాలు తలెత్తడంతో సీబీఐ రంగంలోకి దిగింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏటా నీట్-పీజీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది నీట్ యూజీ పేపర్ లీక్ వల్ల వివాదాలకు దారితీసింది. ఈ లీకుల ఆరోపణల నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని పరీక్షకు కేవలం రెండు గంటల ముందు మాత్రమే తయారు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ రీ టెస్ట్ కూడా రద్దయ్యింది. దీన్ని జులై 25, 27 తేదీల్లో నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది.