»Neet Ug 2024 Vijay Makes Key Comments On Neet Controversy
NEET UG-2024: నీట్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన విజయ్
నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్ దేశవ్యాప్తంగా తీవ్రదుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
NEET UG-2024: Vijay makes key comments on NEET controversy
NEET UG-2024: నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్ దేశవ్యాప్తంగా తీవ్రదుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్షపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. దేశానికి అది అవసరం లేదు. నీట్ నుంచి మినహాయింపు ఒక్కటే పరిష్కారం. ఆ పరీక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాను. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్రాన్ని కోరుతున్నాను. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు తీసుకురావాలి. తాత్కాలిక పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించి ప్రత్యేక ఉమ్మడి జాబితాను తయారుచేయాలి. దానికింద విద్య, ఆరోగ్యాన్ని చేర్చాలని సూచించారు.
తమిళనాడు ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించింది. వైద్యసీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని, ముందులా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అధికారపక్షంతో పాటు విపక్ష నేతలు కూడా ఆమోదం తెలిపారు.