Earthquake in Ladakh registered 4.4 magnitude on the Richter scale
Earthquake: లడఖ్‌లోని లేహ్‌లో భూకంపం వచ్చింది. ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో అక్కడి ప్రాంత ప్రజలు ఆందోళన చెందారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.4గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8:12 గంటలకు లేహ్‌లో భూమి కంపించింది. వెడల్పు : 36.10, పొడవు : 74.81, 150 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అయితే ఈ కంపనం వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. అక్కడి ప్రాంతంలోని వారికి హెచ్చరించినట్లు కూడా పేర్కొంది. దీనిపై అధ్యయనం జరుగుతుందని, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపింది.