Earthquaken: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. పుకుషిమా ప్రిఫెక్చర్ తీరంలో ఈ భూకంపాన్ని గుర్తించారు. బలమైన ప్రకంపనలు కూడా జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. కానీ బలమైన భూప్రకంపనాలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనక గురయ్యారు. ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందో పూర్తిగా తెలియదు. జపాన్‌కు చాలాసార్లు భూకంపం రావడం జరుగుతుంది.