Earthquake : ఇటీవల కాలంలో భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతీ రోజు ప్రపంచంలోని ఏదో ఒక మూల భూకంపం సంభవించిందన్న వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా ఫిలిప్పీన్స్లోని మిండానావో, అండమాన్ సముద్రం లో భారీ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ఫిలిప్పీన్స్లోని మిండానావోలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 140 కి.మీ దూరంలో ఈ భూకంపం సంభవించినట్లుగా అధికారులు పేర్కొన్నారు.
ఇక అండమాన్ సముద్రంలో కూడా 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. హిందూ మహాసముద్రానికి ఈశాన్య భాగంలో ఉన్న అండమాన్ సముద్రం.. టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులకు సమీపంలో ఉండటం వల్ల తరచుగా ఈ భూప్రకంపనలకు లోనవుతోంది. ఇదిలా ఉంటే భూకంపం తర్వాత సముద్రపు అలలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున అండమాన్ సముద్ర ప్రాంతంలోని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.