VZM: శ్రీకాకుళం జిల్లా రణస్థలం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. మృతుడు నెల్లిమర్ల (M) తమ్మాపురం గ్రామానికి చెందిన కోటి(25)గా గుర్తించారు. తల్లిని శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.