Rahul Gandhi: Rahul Gandhi reacted to the Doda terror incident
Rahul Gandhi: జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో జరిగిన ఉగ్ర దాడిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. జమ్మూకశ్మీర్లోని ఈ పరిస్థితికి ప్రభుత్వ విధానాలే కారణమని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. జమ్మూకశ్మీర్లో అమరులైన సైనికులకు నివాళి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఒకదాని తర్వాత మరొకటి ఉగ్రదాడులు జరగడం ఆందోళనకరమన్నారు. వరుసగా జరుగుతున్న దాడులు అక్కడి పరిస్థితులను తెలియజేస్తున్నాయి. బీజేపీ తప్పుడు రాజకీయాల ఫలితాలను సైనికులు, వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి.
आज जम्मू कश्मीर में फिर से एक आतंकी मुठभेड़ में हमारे जवान शहीद हो गए। शहीदों को विनम्र श्रद्धांजलि अर्पित करते हुए शोक संतप्त परिजनों को गहरी संवेदनाएं व्यक्त करता हूं।
एक के बाद एक ऐसी भयानक घटनाएं बेहद दुखद और चिंताजनक है।
लगातार हो रहे ये आतंकी हमले जम्मू कश्मीर की जर्जर…
— Rahul Gandhi (@RahulGandhi) July 16, 2024
ఇది కూడా చూడండి: Chandipura Virus : ‘చండీపురా వైరస్’ విధ్వంసం.. ఆరుగురు చిన్నారులు మృతి, 12మందికి పాజిటివ్
ఈ భద్రతా వైఫల్యానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. దేశ సైనికులకు హాని చేస్తున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలని రాహుల్ గాంధీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గత 32 నెలల్లో జమ్మూకశ్మీర్లో జరిగిన దాడుల్లో 48 మంది సైనికులు మృతి చెందారు. ఈ నెలలో జరిగిన రెండు దాడుల్లోనే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరంగా మారింది. గత నెలలో కూడా జరిగిన జంట దాడుల్లో ఆరుగురు సైనికులు కన్నుమూశారు.
ఇది కూడా చూడండి: Jammu Kashmir : 78 రోజుల వ్యవధిలో 11 ఉగ్రదాడులు.. మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్

