ముఖ కంపెనీ మెటా.. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. రీల్స్‌లో ఎక్కువ ఆడియో ట్రాక్‌లను యాడ్ చేసే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త మల్టీ ట్రాక్ రీల్స్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.
Instagram: ప్రముఖ కంపెనీ మెటా.. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. రీల్స్‌లో ఎక్కువ ఆడియో ట్రాక్‌లను యాడ్ చేసే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త మల్టీ ట్రాక్ రీల్స్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. కొంతమందికి ఈ ఫీచర్ ఇంకా కనిపించడం లేదు. ఇకపై ఒక్క రీల్లో 20 వరకు ఆడియో ట్రాక్‌లను జత చేయవచ్చు. ఆడియోను టెక్ట్స్, స్టిక్కర్, క్లిప్స్‌కు అనుగుణంగా ఎంచుకోవచ్చు. నచ్చిన వాళ్లు దాన్ని సేవ్ చేసుకుని వాడుకోవచ్చు.
అలా చేసిన ప్రత్యేకమైన ఆడియో ట్రాక్‌లను వారి పేరు మీదే లేబుల్ చేస్తామని, వారికి క్రెడిట్ ఇస్తామని తెలిపారు. ఈ న్యూ ఫీచర్ యాడ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌లో వీడియో ఎడిటర్ ఆప్షన్ ఓపెన్ చేయాలి. యాడ్ టు మిక్స్‌పై ట్యాప్ చేసి కావాల్సిన ట్రాక్‌లను ఎంచుకోవాలి. ఒక ఆడియోలో కావాల్సిన భాగాన్ని కూడా ఎంపిక చేసుకునే వీలుంటుంది. పూర్తయిన తర్వాత రీల్ లైవ్‌లోకి వస్తుంది.