»Easily Find The People You Talk To Most At The Top Of Your Calls In Whatsapp New Feature
WhatsApp : వాట్సాప్‌లో ‘ఫేవరెట్స్’ ఫీచర్.. ఇక క్విక్‌గా కాల్స్ చేసేయొచ్చు!
వాట్సాప్‌లో ‘ఫేవరెట్స్’ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌తో ఛాటింగ్‌లు, వాట్సాప్ కాల్స్ మరింత సులభతరం కానున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
WhatsApp Favourite Feature : వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. సరికొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతూనే ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా సంస్థ ‘ఫేవరెట్స్’ అనే ఫీచర్‌ని(new feature) తీసుకొచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇక మనం మనకు ఇష్టమైన వారి కాంటాక్ట్‌లను ఫేవరెట్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఫలితంగా ఛాట్ లిస్ట్‌లోకి వెళ్లి నెతుక్కునే పని ఉండదు. ఎక్కడో కింద ఉన్న కాల్స్‌లోని పేర్లను వెతుక్కోవక్కరలేదు. చక్కగా ఫేవరెట్స్లోకి వెళ్లి నేరుగా మనం ఛాట్ చేసేసుకోవచ్చు. అక్కడి నుంచే క్విక్‌గా కాల్స్ కూడా చేసుకోవచ్చు. అందువల్ల సమయం మరింత ఆదా అవుతుంది.
మరి కొద్ది వారాల్లో ఈ కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. దీన్ని ఫీచర్ అనడం కంటే ఫిల్టర్ అంటే బెటర్‌గా ఉంటుంది. ఇందుకు సంబంధించిన డీటెయిల్స్‌తో ఓ వీడియోని సైతం వాట్సాప్ విడుదల చేసింది. ఎలా తేలికగా ఫేవరెట్స్ని( favorites) యాక్సస్ చేయవచ్చో ఆ వీడియోలో తెలియజేసింది. అక్కడి నుంచి ఎలా కాల్స్ చేసుకోవచ్చు? ఎలా ఛాట్ బాక్స్‌లోకి వెళ్లొచ్చు లాంటి వివరాలన్నీ దీనిలో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దానిపై మీరూ ఓ లుక్కేసేయండి.
easily find the people you talk to most at the top of your calls tab and filter for them in chats by adding them to your Favorites pic.twitter.com/EAUh05IkQp