»Crime Are Whatsapp Calls Coming With These Codes But Beware
Crime: ఈ కోడ్స్‌తో వాట్సాప్ కాల్స్ వస్తున్నాయా.. అయితే జాగ్రత్త!
సైబర్ కేటుగాళ్లు ఈమధ్య కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. విదేశాల నుంచి కాల్ చేస్తున్నాం.. పార్ట్ టైం జాబ్ అని చెప్పి డబ్బులు దోచేస్తున్నారు. ఇలాంటి నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దని సైబర్ భద్రత బలగాలు చెబుతున్నారు.
Crime: Are WhatsApp calls coming with these codes.. but beware!
Crime: సైబర్ కేటుగాళ్లు ఈమధ్య కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల దినేశ్ అనే వ్యక్తికి +84 కోడ్‌తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సాప్ వీడియోకాల్ వచ్చింది. అయితే అది విదేశీ నంబర్ కావడంతో లిఫ్ట్ చేయలేదు. మళ్లీ అదే నంబర్ నుంచి కాల్ వచ్చింది. దీంతో లిఫ్ట్ చేసి మాట్లాడాడు. తమది విదేశీ కంపెనీ అని.. ఆన్లైన్ ద్వారా తాము అప్పగించిన పని చేస్తే రోజుకు రూ.వేలల్లో సంపాదించుకోవచ్చని తెలిపారు. పార్ట్‌టైం జాబ్ కదా అని నమ్మిన దినేశ్ దానికి ఒప్పుకున్నాడు. రిజిస్ట్రేషన్ ఫీజు అని మొదట రూ.54000 కాజేశారు. దీంతో అతను మోసపోయాడని అప్పుడు అర్థం అయ్యింది.
ఈ తరహా కాల్స్ రోజుకి వందల సంఖ్యలో వస్తున్నాయని పోలీసులు గుర్తించారు. +60(మలేషియా), +62(ఇండోనేషియా), +251(ఇథియోపియా), +254(కెన్యా) వంటి విదేశీ నంబర్లు నుంచి కాల్స్ వస్తున్నాయి. విదేశాల్లో కొన్ని రోజులు ఉండే వాళ్లకి నంబర్లు కేటాయించడంతో కొందరు నేరగాళ్లు ఇలా డబ్బులు దోచుకుంటున్నారు. ఈ నంబర్లతో సిమ్ ఉపయోగించకపోయిన.. వాట్సాప్ వినియోగించడంతో కాల్స్ చేసి నేరాలు చేస్తున్నారు. అయితే ఇవి సాఫ్ట్వేర్ ఆధారిత కాల్స్ అని సైబర్ భద్రత నిపుణులు తెలిపారు.
ఇవన్నీ ఉత్తరాది ముఠాలే చేస్తున్నారని తెలిపారు. అయితే ఇలాంటి నంబర్ల నుంచి కాల్స్ వస్తే స్పందించకపోవడమే బెటర్ అని తెలిపారు. డీవోటీ ఆధ్వర్యంలోని సంచార్ సాథి పోర్టల్‌లో ‘రిపోర్ట్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్ (రిక్విన్) ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాంటి కాల్స్‌ను రిసీవ్ చేసుకున్న బాధితులు ఆ పోర్టల్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడు ఆ నంబర్లపై డీవోటీ నిఘా ఉంచుతుంది.