»Cm Revanth Reddy Cm Revanth Gave Important Suggestions To The Film Industry
CM Revanth Reddy: సినీ పరిశ్రమకు కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
రాష్ట్రంలో జరిగిన పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ బ్యూరీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు కీలక సూచనలు చేశారు. అలాగే సినిమా పరిశ్రమకు కొన్ని కండిషన్లు కూడా పెట్టారు.
CM Revanth Reddy: CM Revanth gave important suggestions to the film industry
CM Revanth Reddy: రాష్ట్రంలో జరిగిన పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ బ్యూరీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు కీలక సూచనలు చేశారు. అలాగే సినిమా పరిశ్రమకు కొన్ని కండిషన్లు కూడా పెట్టారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై సినిమాల్లో అవగాహన కల్పించాలన్నారు. వందల కోట్ల బడ్జెట్ సినిమా అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై సినిమాకు ముందు డస్ క్లెయిమర్స్ ప్రదర్శించాలని పేర్కొన్నారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు. కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.
సినిమా టికెట్ రేట్లు పెంచాలని ఇకపై ఎవరు ప్రభుత్వాన్ని కోరుతారో వాళ్లు ఆ సినిమాలో నటించిన స్టార్లతో డ్రగ్స్ అవగాహన వీడియో చేయించి రిలీజ్ చేయించాలి. అప్పుడే రేటు పెంచే అవకాశం కల్పిస్తామని తెలిపారు. సినిమాకు ముందు లేదా తర్వాత మూడు నిమిషాల వీడియోతో డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలా కల్పించకపోతే వాళ్ల సినిమాకు టికెట్లు పెంచే ప్ర్రసక్తి లేదన్నారు. ఈ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాల విషయంలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా సహకరించాలని తెలిపారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రసారం చేయకపోతే థియేటర్ల అనుమతి విషయంలో ఆలోచించాల్సి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు చిరంజీవి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినీ నటులు అందరూ నిమిషం నుంచి రెండు నిమిషాల వీడియోలను రికార్డు చేసి పోలీసులకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం కళాశాలలు, స్కూళ్లలో గంజాయి దొరుకుతుందన్నారు. ధనవంతులు మాత్రమే కాకుండా మధ్యతరగతి, పేద యువకులు కూడా గంజాయికి బానిసలు అవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.