మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ మండలాల సర్వేయర్లతో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. సర్వేయర్లు తమ మండల పరిధిలోని సర్వే దరఖాస్తులను పరిశీలించి పెండింగ్ ఉంచకూడదని ఆదేశించారు. ఎఫ్ లైన్ పిటిషన్లు ఎప్పటికప్పుడు ఫీల్డ్‌కు వెళ్లి పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే ఏడి అశోక్ పాల్గొన్నారు.