GNTR: మద్యం మానేయాలని మందలించినందుకు కన్నతల్లిని మంచంకోడుతో కొట్టి చంపిన కుమారుడిని పొన్నూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇటీవల కొండమూదికి చెందిన కొమ్ము నాగరాజు, ఈ హత్యను దొంగల పనిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే, పోలీసుల విచారణలో కుమారుడే హంతకుడని తేలడంతో అతడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ కృష్ణయ్య వెల్లడించారు.