AP: సంక్రాంతి పండగను పురస్కరించుకొని RTC ప్రత్యేక బస్సులను నడపనుంది. ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు అమలుతో సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8,432 ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో 6 వేలు, అంతర్రాష్ట్ర మార్గాల్లో 2,432 సర్వీసులు నడిపేలా ప్రణాళిక రూపొందించింది.