KNR: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2026 ఏర్పాట్లపై కరీంనగర్ రీజినల్ మేనేజర్ (RM) బీ. రాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్-1 డిపోలో జరిగిన ఈ సమావేశానికి 1, 2 డిపోలకు చెందిన సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు.