దర్శకుడు బాబీ మెగాస్టార్ వీరాభిమాని. తన ఆఖరు చిత్రం కూడా మెగాస్టార్‌తో వాల్టేర్ వీరయ్య సూపర్ డూపర్ హిట్ ఇచ్చి రికార్డులకెక్కాడు. అటువంటింది బాబీ, బాలయ్యతో సినిమా చేయబోతున్నాడనే వార్త బైటకొచ్చినప్పుడు బాలకృష్ణ అభిమానజనం ఒక్కసారి కనుబొమ్మలెత్తారు. ఏం జరుగుతోంది.....మాకు వెంటనే తెలియాలి అన్నట్టుగా తుళ్ళిపడ్డారు.
తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవిది తిరుగులేని అగ్రస్థానం. యువరత్న బాలకృష్ణది అగ్రస్థానం అని చెప్పలేం గానీ, తనది కూడా 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. అందులో ఎన్నో జైత్రయాత్రలు, రికార్డుల నగారాలు. మాస్ జాతరలు. అయితే ఇటీవలి రోజులలో బాలకృష్ణ హవా చాలా దట్టంగానే వీస్తోంది. హిట్లు మీద హిట్లతో, మరోవైపు ఆహా ప్లాట్ఫార్మ్ మీద అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌తో కాస్తా ఇంటింటివాడై పోయాడు బాలకృష్ణ. ఈయనంటే నిర్మాత నాగవంశీకి ఎనలేని అభిమానం. ఏనాటినుంచో బాలయ్యతో చేయాలన్నే చిరకాలస్వప్నం డాకూ మహరాజ్‌తో నెరవేరించని ప్రెస్మీట్లో బాహాటంగానే చెప్పారు నాగవంశీ. ఆయన ఏ మాట చెప్పడానికి వెనుకాడే రకం కాదు. మొహమాటపడే వ్యవహారం అంతకన్నాకాదు.
మరోవైపు డాకూ మహారాజ్ దర్శకుడు బాబీ మెగాస్టార్ వీరాభిమాని. తన ఆఖరు చిత్రం కూడా మెగాస్టార్‌తో వాల్టేర్ వీరయ్య సూపర్ డూపర్ హిట్ ఇచ్చి రికార్డులకెక్కాడు. అటువంటింది బాబీ, బాలయ్యతో సినిమా చేయబోతున్నాడనే వార్త బైటకొచ్చినప్పుడు బాలకృష్ణ అభిమానజనం ఒక్కసారి కనుబొమ్మలెత్తారు. ఏం జరుగుతోంది…..మాకు వెంటనే తెలియాలి అన్నట్టుగా తుళ్ళిపడ్డారు. ఎందుకూ….అంటే బాబీ తాను మెగాస్టార్‌కి చిన్ననాటి నుంచి వీరాభిమానిని అని చెబుతూ, మెగాస్టర్తో ఒక్కటంటే ఒక్క ఫొటో తీయించుకోవడానికి ఎలా తాపత్రయపడ్డాడో చెబుతూ, ఆ ఫోటో కూడా అందరికీ చూపించి సంబరాలు చేసుకున్నాడు.
అంత దారుణమైన మెగాస్టార్ అభిమాని తమ అభిమాన కథానాయకుడితో సినిమా చేయడమంటే ఎందుకో తెలియదుకానీ బాలయ్య ఫేన్స్లో నుంచి మాత్రం కొంత మొదట్టో అప్రోర్ వచ్చిన మాటైతే నిజం. కానీ ఒకటే వాళ్ళ నమ్మకం అప్పటికి. అది నాగవంశీ మీద. బాలయ్యంటే మహాఇష్టమే కాకుండా గొప్ప నిర్మాత. ఎందులోనూ రాజీపడే బాపతు కాదు. గ్యారెంటీగా పెద్ద రేంజ్ సినిమాయే వస్తుందన్న నమ్మిక మాత్రం వాల్ళలో మాట మాత్రంగా ఉంది. బాబీ మీద అపన్మకం కాదు. బాబీ కెపాసిటీ మీద డౌటేం లేదు. కానీ, మెగాస్టార్‌కి అంత గొప్ప అభిమాని తమ ముద్దుల హీరోని ఎలా హేండిల్ చేస్తాడోనని, ఇంతకీ ఆ కథ ఎలా ఉంటుందోననే ఆందోళన, తాపత్రయం మాత్రం ముమ్మరంగానే ఉంది.
ఎప్పటివరకూ ఇదంటే….డాకూ మహరాజ్ విజువల్ కంటెంట్‌ని నాగవంశీ రిలీజ్ చేసేవరకూ ఈ మీమాంస విపరీతంగా అల్లుకుంది. ఒక్కసారి ఎప్పుడైతే గుర్రం మీద బాలయ్య స్వారీ చేస్తూ కనబడ్డాడో….ఒక్క దెబ్బకి సందేహాలు, సంశయాలు పటాపంచలైపోయాయి. బాలయ్య కన్నా బాబీ పేరు చెబితేనే బాలయ్య అభిమానులు ప్రపంచవ్యాప్తంగా పిచ్చెక్కిపోయారు. నిజమే డాకూ మహరాజ్ విజువల్ కంటెంట్ మామ్మూలుగా లేదుగా. పిచ్చిపిచ్చిగా ఉంది. ప్రతీ షాటు ఒక సీనులా ఉంది. ప్రతీ ఫ్రేము పండగలా ఉంది.
ఇందులో లైఫ్ లైన్ ఏంటంటే….శిల్పి గొప్పవాడైనప్పుడు ఏ విగ్రహాన్నైనా అద్భుతంగా చెక్కగలడు. రచయత చేయి తిరిగినవాడైతే ఏ కథనైనా అవలీలగా రాయగలుగుతాడు. దర్శకుడు గడుసువాడైతే ఏ హీరోనైనా ఆద్యంతం రక్తి కట్టించగలడు. బాబీ అందుకు ఓ నిదర్శనం. డౌటే లేదు. డాకూ మాహారాజ్ బాక్సాఫీసులను దోచడం ఖాయం. బాలయ్య అభిమానులకు ఈ కొత్త పండగ సరికొత్త పండగ కావడం కూడా ఖాయం.