WNP: జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (జీటీఏ) కృషి చేయాలని మంగళవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. కలెక్టరేట్లో డీఈవో అబ్దుల్ ఘనీతో కలిసి సంఘం డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీటీఏ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, మద్దిలేటి, రఘునాథ్, సత్యనారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.