HYD: కిమ్స్ ఆస్పత్రిలో హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. యూపీహెచ్‌సీల్లో గర్భిణీ నమోదు, టీకాలు, వ్యాధుల స్క్రీనింగ్ సక్రమంగా ఉండేలా ఆదేశించారు. మందులు అందించి, వైద్య సిబ్బంది అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.